పుష్ప…సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది

134
pushpa
- Advertisement -

టాలీవుడ్ ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతోన్న మూవీ ‘పుష్ప’. స్టైలిష్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రిమూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమాలో ఫహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడు నటిస్తున్నాడు. అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక సందడి చేయనున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. దేవిశ్రీ స్వరాలు అందిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి స్పందన రాగా, మొదటి సింగిల్ ‘దాక్కో.. దాక్కో.. మేక’ యూ ట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా పుష్ప సెకండ్ సింగిల్ తేదీని ప్రకటించారు. ఈ నెల 13వ తేదీన శ్రీవల్లి సెకండ్‌ సింగిల్‌ ను విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్‌ ను విడుదల చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో వస్తున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం డిసెంబర్‌ 17న థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -