సారీ చెప్పిన ఫేస్ బుక్ జుకర్ బర్గ్…

81
fb

ఫేస్ బుక్ యూజర్స్‌కి క్షమాపణ చెప్పారు ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్ బర్గ్. సాంకేతిక కారణాలతో వాట్సాప్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ సేవ‌లు నిలిచిపోగా ఈ మూడు సేవ‌ల‌కు అంత‌రాయం క‌లిగించినందుకు చింతిస్తూ ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఇష్ట‌మైన వ్య‌క్తుల‌తో స‌న్నిహితంగా ఉండ‌టానికి వాట్సాప్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌పై ఎంత ఆధార‌ప‌డుతారో త‌మ‌కు తెలుసు అని.. ఈ అంత‌రాయం క‌లిగించినందుకు క్ష‌మించండి అని మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ కోరారు.

దాదాపు 7 గంట‌ల త‌ర్వాత మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 4 గంట‌ల నుంచి వాట్సాప్‌తో పాటు మిగ‌తా సేవ‌లు పున‌రుద్ధ‌రించ‌బ‌డ్డాయి. వాట్సాప్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ సేవ‌లు నిలిచిపోవ‌డంతో నెటిజ‌న్లు కొన్ని గంట‌ల పాటు ఇబ్బందులు ప‌డ్డారు.

ఫేస్‌బుక్‌, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సేవ‌ల‌కు అంత‌రాయం క‌ల‌గడంతో.. మార్క్ జుక‌ర్ బ‌ర్గ్‌కు భారీ న‌ష్టం వాటిల్లింది. సుమారు ఏడు బిలియన్ల డాలర్ల(మన కరెన్సీలో దాదాపు 50 వేల కోట్ల రూపాయలకు పైనే) నష్టం వాటిల్లింది.