దళితబంధు గొప్ప పథకం: రఘునందన్

82
mla

ద‌ళిత బంధు గొప్ప ప‌థ‌కం. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌వి మంచి ఆలోచ‌న‌లు అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు గుప్పించగా రాష్ట్రంలో ఎన్ని దళిత కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాలకు దళితబంధు వర్తింపచేస్తాం అని తెలిపారు సీఎం. దళిత రిజర్వేషన్ల శాతం పెంచాలి….జాతీయ ప్రభుత్వం దాన్ని గుర్తించాఅన్నారు. పది కాలాల పాటు రఘు నందన్ రావు అసెంబ్లీ లో ఉండాలని కోరుకుంటున్నా అన్నారు సీఎం.

ఇక సభలో ఎస్సి వర్గీకరణ పై రాజసింగ్ , ప్రశాంత్ రెడ్డి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఎస్సి వర్గీకరణ పై తెలంగాణ ప్రభుత్వం మాట తప్పిందని…గతంలో అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు స్పందించడం లేదని ఆరోపించగా అంతేస్ధాయిలో స్పందించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.

ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ లో తీర్మాణం చేసి పంపిన బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే నాన్చుతుందన్నారు ప్రశాంత్ రెడ్డి. ఎస్సి వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.