రష్యన్లు ఫిదా అయిన సామి పాట…

138
- Advertisement -

తెలుగు సినిమ చరిత్రలో పుష్ప సినిమా జోరుగా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా ప్రదర్శితమవుతుంది. ఇటివలే రష్యాలో విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌పై అక్కడి ప్రజలు ఫిదా అయిపోయారు. పుష్పలోని సామీసామీ పాటకు ఒక ఊపుఊపేస్తుంది. ముఖ్యంగా ఇందులోని అన్ని పాటలకు రరష్యన్‌లు స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

డిసెంబర్ 8న రష్యాలో ఈ సినిమా విడుదల కానుంది. కాగా పుష్ప టీం ఇప్పటికే రష్యా చేరుకోని ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. గురువారం మాస్కోలో రష్యన్‌ లాంగ్వేజ్‌ ప్రీమియర్‌షోను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి కథానాయకుడు అల్లు అర్జున్‌, దర్శకుడు సుకుమార్‌, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌, నాయిక రష్మిక మందన్న హాజరయ్యారు. ఈ నెల 3న సెయింట్‌పీటర్స్‌బర్గ్‌లో కూడా ప్రీమియర్‌ షోకు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి…

తండ్రైన సింగర్ రేవంత్..

కప్‌ గెలవడానికే వచ్చాం!

ఎన్టీఆర్ చిత్రానికి ముహూర్తం కుదిరింది

- Advertisement -