పుష్ప 3పై ఆసక్తికర చర్చ!

204
- Advertisement -

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప. తొలిపార్టు విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేయగా రెండోపార్టు కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి పార్టు బన్నీ కెరీర్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టగా రెండో పార్టు కథలో కొంతమార్పు చేసి తెరకెక్కిస్తున్నారు.


పుష్ప 2కి సంబంధించిన కథా చర్చలు తమిళనాడులోని ‘కూనూర్’లో జరపడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా లొకేషన్స్ కూడా వెతికే పనిలో ఉన్నారట. పుష్ప కన్నా పుష్ప 2 ఇంకా రసవత్తరంగా.. పోటాపోటీగా ఉండనున్నదట.


పుష్ప 2 మొదలే కాలేదు పుష్ప 3 ని రంగంలోకి దింపేశారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అందుకు తగ్గట్టు కథను కూడా రెడీ చేసే పనిలో పడ్డాడట కూడా.

- Advertisement -