మూడు కోతులు..ఒక మేకతో పూరీజగన్నాథ్‌

125
Puri-jagannadh-Next-Movie-Title

పూరీ జగన్నాథ్‌ హిట్ల లో ఉన్నా..ఫ్లాప్‌ల్లో ఉన్నా..ఆ పేరుకు ఉన్న క్రేజ్ అలాంటిది. హీరోతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్స్ కొట్టగల దమ్మునోడు. స్టార్ హీరోఐనా..యంగ్ హీరోలతో అయినా మూడు నెలల్లో సినిమా పూర్తీ చేయడం ఈ డాషింగ్ డైరెక్టర్ మరో స్పషాలిటీ. అలాగే సినిమాకు టైటిల్స్ పెట్టడంలో మనోన్ని మించినవాడు లేడు. సినిమా ఎలా ఉండబోతోందో టైటిల్ తోనే హింట్ ఇస్తాడు. ఇడియట్, పోకిరి,దేశముదురు, టెంపర్‌, లోఫర్ ఇలా మాస్ టైటిల్స్ పెట్టాలన్నా..అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం లాంటి పొయటిక్ టైటిల్స్తో ఆకట్టుకోవాలన్నా పూరికే చెల్లింది. టైటిల్స్ విషయంలో ఎప్పుడు కొత్తదనం చూపించే పూరీ తాజాగా  మరో డిఫెరెంట్ టైటిల్‌ తో రాబోతున్నాడు.

 pruijaannadh

ఇటీవల తన స్థాయికి తగ్గ హిట్స్ అందించటంలో విఫలమవుతున్న పూరి జగన్నాథ్, ఓ బిగ్ హిట్తో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. అందుకే యంగ్ హీరోలతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కించిన రోగ్ సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న పూరి, ఆ తరువాత చేయబోయే సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాడు. అంతేకాదు ఈ సినిమాకు మరోసారి తన మార్క్ కనిపించేలా డిఫరెంట్ టైటిల్ను పిక్స్ చేశాడు. ముగ్గురు హీరోలతో రూపొందించనున్న ఈ సినిమా కోసం మూడు కోతులు ఒక మేక అనే టైటిల్ను రిజిస్టర్ చేయించాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించనున్నారు.