మరోసారి ‘పైసా వసూల్’ కాంబినేషన్

369
Puri Jagannth Balakrishna
- Advertisement -

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం పైసా వసూల్. ఈమూవీలో బాలకృష్ణ సరసన శ్రీయా శరన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈసినిమా భారీ అంచనాలతో తెరకెక్కిన ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈమూవీ తర్వాత బాలకృష్ణతో మరో మూవీ చేస్తానని ప్రకటించారు పూరీ జగన్నాథ్.

తాజాగా ఉన్న సమాచారం మేరకు బాలకృష్ణ కోసం పూరీ జగన్నాథ్ కథను రెడీ చేసుకున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే పూరీ బాలకృష్ణకు కథ వినిపించాడని త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనురని సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ కేఎస్ రవి కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

ఈమూవీని సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. ఈసినిమాలో బాలయ్య యంగ్ లుక్ లో దర్శనమివ్వనున్నారు. ఇక ఇటివలే బాలకృష్ణ బోయపాటికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈమూవీ కూడా త్వరలోనే ప్రారంభంకానుంది. ఈరెండు సినిమాలు పూర్తైన తర్వాత బాలకృష్ణ పూరీతో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

- Advertisement -