వాల్మీకి ప్రీ రిలీజ్ బిజినెస్.. అదుర్స్..!

645
valmiki
- Advertisement -

మెగా హీరో వరుణ్ తేజ్‌-గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రవ వాల్మీకి. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 20న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాల్లో దూకుడు పెంచగా తాజాగా ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ సత్తాచాటింది వాల్మీకి.

తెలుగు రాష్ట్రాల్లో వాల్మీకిథియేట్రికల్ హక్కులు రూ.20 కోట్లకు విక్రయించగా ఇక ప్రపంచ వ్యాప్తంగా అయితే సుమారు రూ.25 కోట్ల బిజినెస్ జరిగింది. నైజాంలో రూ. 7.40 కోట్లు,సీడెడ్ 3.35 కోట్లు,నెల్లూరు 0.75 కోట్లు,కృష్ణా 1.60 కోట్లు,గుంటూరు 1.80 కోట్లు,విశాఖపట్నం 2.40 కోట్లు,తూర్పుగోదావరి 1.60 కోట్లు,పశ్చిమగోదావరి 1.10 కోట్లు రాబట్టగా దేశంలోని ఇతర ప్రాంతాల్లో 1.50 కోట్లు,ఓవర్సీస్‌లో 3.50 బిజినెస్ చేసింది.

ప్రస్తుతం వరుణ్ తేజ్‌కు ఉన్న మార్కెట్‌ను బట్టి చూస్తే ఈ రూ.25 కోట్లు వసూలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించగా మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు.

- Advertisement -