టాలీవుడ్ డాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్, హీరో రామ్ కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇవాళే ఈమూవీ పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. రేపటి నుంచి ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఈమూవీలో రామ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తుంది. హీరోయిన్ చార్మీ, పూరీ జగన్నాథ్ లు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈమూవీలో హీరోయిన్ ను మాత్రం ఇంకా ప్రకటించలేదు.
ఇన్ని రోజులు రామ్ సరసన తెలుగు అమ్మాయిని తీసుకుంటారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ ఫిక్స్ అయినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్లామర్ బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్ ను తీసుకున్నట్లు తెలుస్తుంది. రామ్ సరసన హీరోయిన్ గా అనూ ఇమ్మాన్యుయేల్ ను తీసుకోవాలని పూరీ భావిస్తున్నట్లు సమాచారం.
ఆమె ఇటివలే నటించిన సినిమాలు ఏవి పెద్దగా విజయం సాధించలేదు. పవన్ కళ్యాణ్ అజ్నాతవాసి, నాపేరుసూర్య నాఇల్లు ఇండియా, శైలజారెడ్డి అల్లుడు ఆమెకి నిరాశనే మిగిల్చాయి. ఈసినిమాతోనైనా అనూ ఇమ్మాన్యుయేల్ హిట్ కొడుతుందో చూడాలి మరి. మే చివరి వారంలో ఈచిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్.