పూరీజగన్నాథ్.. ఈయనో ‘ఇడియట్’ లాంటోడు. ఎందుకంటారా..ఇడియట్ సినిమా చూసిన ఆడియెన్స్ కి పూరీయే గుర్తొస్తాడు కాబట్టి. అందుకే తమకి నచ్చిన పూరీని ఫ్యాన్సంతా ఓ స్పెషల్ ఇడియట్ లా పీలౌతాడు. ఎందుకంటే..హీరో కనిపించే ప్రతి సీన్లలో పూరి మార్క్ ఖచ్చితంగా కనిపిస్తుంది.
పూరీ జగన్నాథ్ హిట్ల లో ఉన్నా..ఫ్లాప్‌ల్లో ఉన్నా..ఆ పేరుకు ఉన్న క్రేజ్ మాత్రం ఇప్పటికీ మారలేదు. హీరోతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్స్ కొట్టగల దమ్మునోడు. స్టార్ హీరోఐనా..యంగ్ హీరోలతో అయినా మూడు నెలల్లో సినిమా పూర్తీ చేయడం ఈ డాషింగ్ డైరెక్టర్ మరో స్పషాలిటీ.
అలాగే సినిమాకు టైటిల్స్ పెట్టడంలో మనోన్ని మించినవాడు లేడు. సినిమా ఎలా ఉండబోతోందో టైటిల్ తోనే హింట్ ఇస్తాడు. ఇడియట్, పోకిరి,దేశముదురు, టెంపర్, లోఫర్ ఇలా మాస్ టైటిల్స్ పెట్టాలన్నా..అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం లాంటి పొయటిక్ టైటిల్స్ తో ఆకట్టుకోవాలన్నా పూరికే చెల్లింది. ఇదిలా ఉంటే..ఇటీవల తన స్థాయికి తగ్గ హిట్స్ అందించటంలో విఫలమవుతున్న పూరి జగన్నాథ్, ఓ బిగ్ హిట్ తో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలయ్య సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
ఇదిలాఉంటే…బాలయ్య సినిమాకి కొత్త అసిస్టెంట్ డైరెక్టర్ ని పెట్టేసుకున్నాడు పూరి. పవిత్ర పూరీ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోందట. అదేనండీ..పూరీ జగన్నాథ్ కూతురు. ఇప్పటికే పూరీ తనయుడు ఆకాష్ హీరోగా ‘ ఆంధ్రా పోరి ‘ తో ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ మూవీ ఫ్లాప్ కావడంతో సరైన ఎంట్రీ కోసం అన్ని రకాలుగా ట్రైనప్ అవుతున్నాడు. త్వరలోనే తన డైరెక్షన్ లోనే ఆకాష్ హీరోగా సినిమా చేయాలనే ప్లాన్ లో వున్నాడు పూరీ.
అలాగే పూరీ కూతురు పవిత్ర కూడా హీరోయిన్ అవ్వాలని ఫిక్స్ అయిందట. అందుకు పూరీ కూడా అడ్డుచెప్పలేదట. అయితే ముందుగా సినిమా ఇండస్ట్రీ ప్లస్..మైనస్ లు తెలియడానికి ఎక్స్‌పీరియన్ కోసం తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయమని కండిషన్ పెట్టాడట పూరీ.
దాంతో పూరీ ప్రస్తుతం బాలయ్యతో తీస్తున్న న్యూ మూవీ టీంలో జాయిన్ అయిపోయిందట పవిత్ర. అయితే సినిమా టైటిల్స్‌లోనే కాదు.. కూతురి విషయంలో కూడా డిఫెరెంట్ గా ఆలోచించి తన కూతురికి అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చేశాడు. మొత్తానికి హీరోయిన్ అవ్వాలనే తన కూతురి కోరికను త్వరలో పూరీ తీర్చబోతున్నాడన్నమాట.