చిరు మళ్లీ వస్తాడా..?

254
Chiranjeevi to quit MEK
Chiranjeevi to quit MEK
- Advertisement -

మీలో ఎవరు కోటీశ్వరుడు.. తెలుగు ప్రజలను అత్యంతంగా ఆకట్టుకున్న టెలివిజన్ ప్రోగ్రాం. ఈ షో చాలా పాపులర్ అయింది. తొలి మూడు సీజన్లకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించగా.. నాలుగో సీజన్‌కి చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరించారు. ‘ఖైదీ నెంబర్ 150’తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి.. బాక్సఫీసును షేక్ చేసిన చిరంజీవి.. ఎంఈకేలో లో మాత్రం అదరగొట్టలేకపోయాడు. ఈ షో ప్రసారమైన వారంలో టీఆర్పీ రేటింగ్స్ లిస్టులోనూ ‘ఎంఈకే’కు టాప్ ప్లేస్ లో ఉంటుందనుకుంటే అలాంటిదేమీ దక్కలేదు. అసలు టాప్-5లోనే ఎంఈకే లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమైంది. బార్క్ రేటింగ్స్ ప్రకారం ‘జనతా గ్యారేజ్’ ప్రిమియర్ షో రోజున అగ్రస్థానంలో ఉంటే.. తర్వాతి నాలుగు స్థానాల్ని టీవీ సీరియల్స్ దక్కించుకుని అందరికీ షాక్ ఇచ్చాయి.

chiru nag

ఎంఈకే షో ఆరంభంలోనే నాగార్జున గెస్ట్ గా విచ్చేశాడు. ఒక పార్టిసిపెంట్ కోటి రూపాయల ప్రశ్న వరకు వెళ్లాడు. అయినా ఈ ప్రోగ్రాంకు ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రాలేదనే విషయం ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. ఏడాదిన్నర కిందట నాగార్జున హోస్ట్ గా మొదలుపెట్టిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రాం పెద్ద సంచలనం సృష్టించింది. తెలుగు టీవి హిస్టరీ లోనే మరే కార్యక్రమానికి రాని స్థాయిలో ఊహించిన టీఆర్పీ రేటింగ్స్ తెచ్చుకుంది ఈ కార్యక్రమం. ఐతే తొలి సీజన్ తో పోలిస్తే తర్వాతి రెండు సీజన్లలో రేటింగ్స్ తగ్గుతూ వెళ్లడంతో నాలుగో సీజన్ కు నాగ్ స్థానంలో మెగాస్టార్ చిరంజీవిని తీసుకొచ్చింది మాటీవీ యాజమాన్యం. చిరంజీవి బుల్లితెర ఎంట్రీ మెగా సక్సెస్‌ అవుతుందని అనుకుంటే, ఆరంభం నుంచే ఇది డిజాస్టర్‌ దిశగా సాగింది. ఐతే ఎలాగైతేనేం సీజన్లో ఫుల్ ఎపిసోడ్లను లాగించేశాడు చిరు. మొత్తానికి ఎంఈకే నాలుగో సీజన్ కు తెరపడిపోయింది. ఇక ఈ షో భవితవ్యం ఏంటి.. చిరు మళ్లీ ఈ షోలో కనిపిస్తాడా అన్న ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లేదు.

chiranjeevi-meelo-evaru-koteeswarudu-promo-2

ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ షో గురించి ప్రస్తావిస్తూ.. తర్వాత ఏంటో చెప్పలేను అనేశాడు చిరు. ఈ ప్రోగ్రాం రూపకర్తల మనసులో ఏముందో ఏంటో అంటూ సమాధానం దాటవేశాడు. మరోవైపు చిరంజీవి కూడా తన 151వ సినిమా ఉయ్యాలవాడ నర్సింహ రెడ్డి సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు. చరిత్ర నేపథ్యం ఉన్న సినిమా కావడంతో చిరంజీవి కూడా ఏంఈకేను వదులుకోవడానికి సిద్దమైనట్లు సమాచారం. మరీమీలో ఎవరు కోటీశ్వరుడు షో ఐదో సీజన్‌లో హోస్ట్‌గా ఎవరు వస్తారో కొద్ది రోజులు ఆగితే కానీ తెలియదు..

- Advertisement -