పూరి మళ్ళీ మొదలెట్టాడు

32
- Advertisement -

‘లైగర్’ షూటింగ్ గ్యాప్ లో పూరి జగన్నాథ్ పోడ్కాస్ట్ మొదలు పెట్టి పూరి ముసిన్గ్స్ అంటూ వాయిస్ తో మోటివేషనల్ ఆడియోలు పెట్టడం మొదలు పెట్టారు. మధ్యలో లైగర్ షూటింగ్ మొదలయ్యాక కొంత గ్యాప్ ఇచ్చి ఆడియోలు పెట్టలేదు. లైగర్ తర్వాత పూరి ఎక్కడా కనిపించలేదు. లైగర్ వివాదాలు ఒక దాని తర్వాత ఇంకొకటి చుట్టు ముట్టేశాయి. అయితే ఇప్పుడు పూరి బ్యాడ్ ఫేస్ నడుస్తోంది.

నెక్స్ట్ విజయ్ దేవరకొండ తో చేయాల్సిన ‘జనగణమన’ క్యాన్సిల్ అయింది. దీంతో పూరి నెక్స్ట్ ఏంటి ? అనే డైలమాలో పడ్డాడు. ఇక మళ్ళీ గ్యాప్ దొరికే సరికి పోడ్కాస్ట్ లు మొదలెట్టాడు. తనకి అనిపించిన టాపిక్ మీద ఆడియో రికార్డ్ చేసి పెడుతున్నారు. ఏదేమైనా సక్సెస్ లో ఉన్నప్పుడు ఎవరు చెప్పినా అద్భుతం అంటారు జనాలు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి సక్సెస్ ట్రాక్ ఎక్కడంతో పూరి మ్యూసింగ్స్ కి మంఛి రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పుడు లైగార్ డిజాస్టర్ తర్వాత పూరి మాటలు అతని కొందరు అభిమానులు తప్ప ఎవరూ వినేందుకు ఆసక్తి చూపించడం లేదు. పూరి ఇలా ఫ్రీ గా కూర్చొని జనాలకి సందేశాలు ఇచ్చే ఆడియో లు పెట్టడం మానేసి ఓ మంచి కథ రాసుకొని మళ్ళీ బ్లాక్ బస్టర్ కొడితే బెటర్ అని మూవీ లవర్స్ భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

దిల్ రాజు కొత్త దుకాణం

పిక్ టాక్ : బ్లాక్ డ్రెస్ లో గ్లామరసం

అమితాబ్ కామెంట్స్ పై రచ్చ

- Advertisement -