రేషన్ షాప్‌కు సైకిలు లేదా బైక్ మీద వెళ్లి రేషన్ తీసుకుంటాము కానీ ఓ వ్యక్తి మాత్రం మెర్సిడెజ్ బెంజ్ కారులో వెళ్లి రేషన్ తీసుకున్నారు అంటే నమ్ముతారా…అవును ఇదీ నిజం పంజాబ్‌లోని హోషియాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి బెంజ్ కారులో రేషన్ షాప్ వద్దకు వచ్చాడు. ఇక తనకున్న రేషన్ కార్డును చూపించించాడు. దాంతో డీలర్ అమిత్ కుమార్ అతనికి ఉచితంగా ఇవ్వాల్సిన గోధుమలను అందజేశాడు. అక్కడే ఉన్న మరో వ్యక్తి సహాయం చేత వాటిని కారు డిక్కీలో పెట్టుకొని వెళ్లిపోయాడు.
ఈ వ్యవహారంపై డీలర్ అమిత్ కుమార్‌ను విలేకరులు ప్రశ్నించగా బెంజ్ కారులో వచ్చిన వ్యక్తికి బీపీఎల్ కుటుంబాలకు ఇచ్చే నీలి రంగు కార్డు ఉందన్నారు. ఆ కార్డును పరిశీలించిన తర్వాతే అతనికి గోధుమలను ఇచ్చామని తెలిపారు. మొత్తానికి ఈ వివాదం ప్రభుత్వ ఉన్నతాధికారులకు చేరడంతో ..వెంటనే నీలి రంగు కార్డులను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు.