ప్లేఆఫ్స్‌ రేసు నుంచి పంజాబ్‌ ఔట్‌..

28
- Advertisement -

ఐపీఎల్ 2024లో భాగంగా ఆర్సీబీ వరుసగా నాలుగో విజయాన్ని దక్కించుకుంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. 242 పరుగుల భారీ టార్గెట్‌ని చేధించే క్రమంలో 181 పరుగులు మాత్రమే చేసింది పంజాబ్.రిలీ రూసో 27 బంతుల్లో 61 ఆకట్టుకోగా శశాంక్‌ సింగ్‌ 19 బంతుల్లో 37 పరుగులు చేయగా మిగితా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. దీంతో 17 ఓవర్లలోనే ఆలౌట్ అయింది పంజాబ్.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఆరంభం నుండే పంజాబ్ బౌలర్లపై అటాక్ మొదలెట్టారు. విరాట్‌ కోహ్లీ 47 బంతుల్లో 6 సిక్స్‌లు,7 ఫోర్లతో 92 పరుగులు చేయగా రజత్‌ పాటిదార్‌ 23 6 సిక్స్‌లు,3 ఫోర్లతో బంతుల్లో 55, గ్రీన్ 27 బంతుల్లో 46 పరుగులు చేయడంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లు కొల్పోయి 241 పరుగులు చేసింది. కోహ్లీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది.

Also Read:KCR:బండి సంజయ్‌తో పైసా పనికాదు?

- Advertisement -