ఐపీఎల్ 14 2021 సీజన్‌లో మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్‌లో ముంబై చిత్తుగా ఓడగా.. సన్‌రైజర్స్‌తో జరిగిన తమ చివరి మ్యాచ్‌లో పంజాబ్ ఘోర ఓటమి చవిచూసింది.
ఈ క్రమంలో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. దీంతో హోరాహోరీ పోరు ఖాయమనిపిస్తోంది. ఐపీఎల్‌లో ఈ ఇరు జట్లు ఇప్పటి వరకు 26 సార్లు తలపడగా.. 14 విజయాలతో ముంబైనే పై చేయిసాధించింది. పంజాబ్ 12 మ్యాచ్‌ల్లోనే గెలిచింది. గత రెండు సీజన్లలో మాత్రం ఇరు జట్లు చెరొక విజయాన్నందుకున్నాయి.
తుది జట్లు :
Mumbai Indians (Playing XI): Rohit Sharma(c), Quinton de Kock(w), Suryakumar Yadav, Ishan Kishan, Hardik Pandya, Krunal Pandya, Kieron Pollard, Jayant Yadav, Rahul Chahar, Jasprit Bumrah, Trent Boult
Punjab Kings (Playing XI): KL Rahul(w/c), Mayank Agarwal, Chris Gayle, Nicholas Pooran, Deepak Hooda, Moises Henriques, Shahrukh Khan, Fabian Allen, Mohammed Shami, Ravi Bishnoi, Arshdeep Singh