ఇద్దరు పెళ్లి చేసుకుంటే మాములు విషయమే. కానీ ఒక రాజకీయ జీవితం ప్రారంభించి అనతికాలంలో మంత్రిగా సేవలందిస్తోన్న వ్యక్తి, నిరంతరం ప్రజాసేవకే అంకితమయ్యే ఒక అధికారిణి పెళ్లి చేసుకుంటే అది ఖచ్చితంగా న్యూస్ అవుతుంది. పంజాబ్‌కు చెందిన విద్యాశాఖమంత్రి హర్‌జోత్ సింగ్ బేన్స్ అదే రాష్ట్రంలో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారిణి జ్యోతి యాదవ్ త్వరలో ఒక్కటికాబోతున్నారు. ఇటీవలే ఈ జంటకు నిశ్చితార్థం జరిగినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
రూప్నగర్ జిల్లాలోని ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన హర్‌జోత్ సీఎం మాన్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. పంజాబ్ కేడర్‌కు చెందిన జ్యోతి యాదవ్ మాన్సా జిల్లాలో ఎస్పీగా పనిచేస్తున్నారు. జ్యోతి గతేడాది ఆప్ ఎమ్మెల్యే రాజింద్‌పాల్ కౌర్ చినా నియోజకవర్గంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టి వార్తల్లో నిలిచారు.
32యేళ్ల బేన్స్ ఆమ్ ఆద్మీ పార్టీ యువజన విభాగానికి నేతృత్వం వహించారు. వీరిద్దరూ మార్చి 25-26 న వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, భగవంత్ మాన్ సిం,గ్ మనీష్ సిసోడియా కుటుంబ సభ్యులు, పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సాన్ ద్వాన్ పెళ్లికి హాజరు కానున్నట్టు జాతీయ మీడియా ప్రచారం. ఆప్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతనే సీఎం భగవంత్ మాన్ నరీందర్ కౌర్ భరాజ్ నరీంద్పాల్ సింగ్ సవానా కూడా పెళ్లి చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి…