ఓటీటీ : ఏ ఆస్కార్ చిత్రం ఎందులో ?

18
- Advertisement -

కరోనా అనంతరం ఓటీటీలకు ఫుల్ డిమాండ్ క్రియేట్ అయ్యింది. ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు అందరి చూపు ఆస్కార్ చిత్రాల మీద పడింది. సాధారణ చిత్రాల కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు.. ఇక ఆస్కార్ చిత్రాల కోసం ఏ రేంజ్ లో ఎదురుచూస్తారు ?. మరి ఆస్కార్ అవార్డు సాధించిన చిత్రాలు ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ అవుతున్నాయో చూద్దాం రండి.

  1. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ : సోనీలీవ్‌ లో స్ట్రీమింగ్‌ అవుతుంది.
  2. ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌ : నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ అవుతుంది.
  3. బ్లాక్‌పాంథర్‌-వకండా ఫరెవర్‌ : డిస్నీ+ హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్‌ అవుతుంది.
  4. అవతార్‌ 2: అమెజాన్‌ ప్రైమ్‌, యాపిల్‌ టీవీ, వుడ్‌, డిస్నీ+హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్‌ అవుతుంది.
  5. టాప్‌ గన్‌: మావెరిక్‌: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో స్ట్రీమింగ్‌ అవుతుంది. (తెలుగు ఆడియో కూడా ఉంది)
  6. ఆర్‌ఆర్‌ఆర్‌ : జీ5, డిస్నీ + హాట్‌ స్టార్‌ లో స్ట్రీమింగ్‌ అవుతుంది.
  7. ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ : నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ అవుతుంది.
  8. పినాషియో : నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ అవుతుంది.

ఐతే, ఆస్కార్ సాధించిన ఉమెన్‌ టాకింగ్‌, నవానీ, ది వేల్‌ వంటి మిగిలిన చిత్రాలు ప్రస్తుతం భారత్‌లో ప్రసారానికి అందుబాటులో లేవు. మరి రానున్న రోజుల్లో అందుబాటులోకి వస్తాయేమో చూడాలి.

ఇవి కూడా చదవండి…

ఆస్కార్…నాటు సాంగ్ ఇంట్రడ్యూస్‌డ్‌ బై దీపికా.!

ఆస్కార్ గిఫ్ట్ బ్యాగ్ విలువెంతో తెలుసా?

ఆస్కార్‌ 2023..విజేతలు వీళ్లే !

- Advertisement -