ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా ఈరోజు ఢిల్లీ కేపిటల్స్,- పంజాబ్ కింగ్స్. తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు ఛేజింగ్‌ను ఎంచుకుంది. తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆ జట్టు ఢిల్లీని ఫస్ట్ బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్ కోసం పంజాబ్ ఎటువంటి మార్పులు చేయలేదు. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఈ మ్యాచ్ కోసం రెండు మార్పులు చేసింది. చేతన్ సకారియా స్థానంలో ఖలీల్ అహ్మద్ ను కేఎస్ భరత్ స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్ ను తుది జట్టులోకి తీసుకుంది.
రెండు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తే…దానికి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. అదే సమయంలో ఓడిన జట్టు మాత్రం ప్లే ఆఫ్స్ ఆశలను పూర్తిగా వదిలేసుకోక తప్పదు. వెరసి ఈ మ్యాచ్ రెండు జట్లకు గెలిచి నిలవాల్సిన మ్యాచ్‌గానే పరిణమించింది. ఇక ఇప్పటిదాకా 12 మ్యాచ్‌లు ఆడిన ఇరు జట్లు… 6 విజయాల చొప్పున 12 పాయింట్లు సాధించాయి. అయితే నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న ఢిల్లీ ఐదో స్థానంలో కొనసాగుతుండగా… పంజాబ్ మాత్రం 7వ స్థానంలో ఉంది.
తుది జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్-రిషభ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ అహ్మద్, మార్ష్, రోవ్ మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోకియా, ఖలీల్ అహ్మద్
పంజాబ్ కింగ్స్-మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), జానీ బెయిర్ స్టో, శిఖర్ ధావన్, భానుక రాజపక్స, లియాం లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ, రిశి ధావన్, హర్ ప్రీత్ బ్రార్, కగిసో రబడ, రాహుల్ చహర్, అర్ష దీప్ సింగ్