పంజాబ్‌లో కీలక నిర్ణయం…

55
- Advertisement -

పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్లుతున్న భగవంత్‌ మాన్. తాజాగా ప్రభుత్వ స్కూళ్లకు ఉండే వ్యక్తుల పేర్లను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌లోని దాదాపుగా 56 ప్రభుత్వ పాఠశాలలకు ఉన్న కులాల పేర్లను తొలిగించింది. స్కూల్ అనేది కులాలను గుర్తు చేసేదిగాను, కులాల వైషమ్యాలను విద్యార్దుల్లో రేకెత్తించేదిగా ఉండకూడని భావించిన ఆప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.

గతంలో ప్రభుత్వ స్కూళ్ల నిర్మాణానికి కొంతమంది దాతలు దానం చేసిన స్థలాల్లో స్కూళ్ల నిర్మాణాలు ఉన్నాయని స్కూళ్ల భవన నిర్మాణాలకు కూడా పలువురు దాతలు ధన సహాయం చేసిన వారి పేర్లను పెట్టడం జరిగిందని స్కూళ్లను నిర్మాణ దాతాల పేర్లు పెడుతుంటారు. ఆయా దాతల పేర్లు పెట్టిన క్రమంలో ఆప్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ స్కూళ్ల పేరులో కులాన్ని వర్గాన్ని సూచించే పేరు ఉండకూడదని ఉంటే వాటిని తొలిగించే విధంగా ఆప్ సర్కార్‌ నిర్ణయం తీసుకుందని విద్యాశాఖ మంత్రి హర్‌ జోత్‌సింగ్ పేర్కొన్నారు.

పిల్లల మనుసులో కులభావాలని పెంచుతుందని అటువంటి భావన వారితో పాటు పెరుగుతుందని అటువంటిది మంచిది కాదని…కులవిభజనకు కారణమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే కులం, వర్గాన్ని సూచించే పేర్లను మార్చాలని ఆదేశాలు ఇచ్చామని మంత్రి తెలిపారు. వారం రోజుల్లో 56 ప్రభుత్వ పాఠశాలలకు కులాన్ని సూచించే పేర్లను తొలగించనున్నట్టు తెలిపారు. ఆ పేర్ల స్థానంలో స్థానిక అమరవీరులు, లేదా ప్రముఖ వ్యక్తి పేర్లను పెట్టనున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి…

2024కు 2023 ఎన్నికల రిహార్సల్స్‌

తల్లి పాడే మోసిన ప్రధాని మోడీ..

పూజలకు సిద్దమైన వారాహి

- Advertisement -