బాలయ్య ఫ్యాన్స్ కోరిక తీరేనా ?

1669
- Advertisement -

బాలయ్య బాబు నటించిన ‘వీరసింహారెడ్డి’ మూవీ మేకింగ్ వీడియోని న్యూఇయర్ కానుకగా మేకర్స్ ఈరోజు ఉదయం 11:24 గంటలకు రిలీజ్ చేయాల్సి ఉంది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వీడియోని ఈరోజు మధ్యాహ్నం 12:58గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు మేకర్స్. దీంతో బాలయ్య ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. మొదటి నుంచి మా బాలయ్య బాబు సినిమా ప్రమోషన్స్ ను ఇలాగే నిర్లక్ష్యం చేస్తున్నారని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే బాల‌య్య ఫ్యాన్స్ మైత్రీ మూవీ మేక‌ర్స్‌పై ఫైర్ అవుతున్నారు.

ముఖ్యంగా వాల్తేరు వీరయ్య‌కు చూపిస్తున్న హుషారు వీర‌సింహా రెడ్డి ప్ర‌మోష‌న్స్ విష‌యంలో మైత్రీ మూవీ మేక‌ర్స్‌ చూపించడం లేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఐతే, తమ పై అపోహతో తప్పుడు ప్రచారాన్ని నమ్మి, హ‌ర్ట్ అయిన బాలయ్య ఫ్యాన్స్‌కు మైత్రీ వారు సరైన స‌మాధాన‌మిచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వీర‌య్య త‌ర‌హాలోనే బాల‌య్య సినిమా ప్రీ రిలీజ్‌కు ముందు కూడా ఓ భారీ ప్రెస్‌మీట్‌ను జ‌న‌వ‌రి 3న ఓ స్టార్ హోట‌ల్‌లో ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇదే విషయాన్ని ఇప్పటికే బాలయ్య ఫ్యాన్స్ కి చెప్పారు. కానీ, బాలయ్య ఫ్యాన్స్ కోరిక మరోలా ఉంది. ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ కన్నా ముందు ఓ భారీ సెట్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. బాలయ్య సినిమాని కూడా ఇదే ప్రొడ్యూసర్స్ నిర్మిస్తున్న నేపథ్యంలో.. ‘వీరసింహారెడ్డి’ సినిమా ప్రెస్ మీట్ ను కూడా అలా ఓ భారీ సెట్ లో పెట్టాల్సిందే అని బాలయ్య ఫ్యాన్స్ మైత్రి మూవీ మేకర్స్ ని కోరుతున్నారు. బాలకృష్ణ సినిమాని అన్నీ సినిమాల కంటే భారీ స్థాయిలో ప్రమోట్ చేయాలని బాలయ్య ఫ్యాన్స్ కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి…

‘ఖుషి’తో ఫ్యాన్స్ ఖుషీ !

2022…తల్లులైన సెలబ్రిటీలు

దళపతి 67లో కొత్త విలన్‌..?

- Advertisement -