ముంబైపై పంజాబ్ 9 వికెట్లతో గెలుపు

204
mi
- Advertisement -

ఎట్టకేలకు పంజాబ్ గెలుపు తీపి రుచి చూసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది పంజాబ్. 132 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్…17.4 ఓవర్లలో ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 132 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ లోకేశ్‌ రాహుల్‌ (52 బంతుల్లో 60 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), క్రిస్‌ గేల్‌ (35 బంతుల్లో 43 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో పంజాబ్ ఘన విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 131 పరుగులు చేసింది. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ (52 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ (33; 3 ఫోర్లు, ఒక సిక్సర్‌) ఫర్వాలేదనిపించాడు. పంజాబ్‌ బౌలర్లలో మహమ్మద్‌ షమీ, రవి బిష్ణోయ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

- Advertisement -