- Advertisement -
వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది గుజరాత్. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్..16 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కొల్పోయి 145 పరుగులు చేసింది. శిఖర్ ధవన్ (53 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 62 నాటౌట్) ,రాజపక్స (28 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 40), లివింగ్‌స్టోన్ (10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30 నాటౌట్) ధాటిగా ఆడారు. దీంతో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది పంజాబ్.
ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 143/8 స్కోరు చేసింది. సుదర్శన్ (50 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 65 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. మిగితా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. గుజరాత్ టాప్ ఆర్డర్‌ని రబాడ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దెబ్బతీశాడు.
- Advertisement -