ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్‌కు హ్యాట్రిక్ ఓటమి ఎదురైంది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పంజాబ్ విధించిన 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై…126 పరుగులకే కుప్పకూలింది. శివమ్ దూబే (30 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 57) అర్ధసెంచరీతో రాణించిన రుతురాజ్ (1) , ఊతప్ప (13),మొయిన్ అలీ (0), జడేజా (0) డకౌట్‌గా వెనుదిరిగారు. ఫలితంగా పవర్‌ప్లేలోనే నాలుగు వికెట్లు కొల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది చెన్నై. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ కూడా చేతులెత్తేయడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు.
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ తొలి ఓవర్‌లోనే కెప్టెన్ మయాంక్ అగర్వాల్(4)ను.. రెండో ఓవర్‌లో ధోనీ సూపర్ త్రోతో రాజపక్స (9)ను కోల్పోయింది. కానీ పది ఓవర్లు పూర్తయ్యేసరికి జట్టు 109 పరుగులు సాధించింది. దీనికి కారణం లివింగ్‌స్టోన్ వీరబాధుడే. అలవోకగా సిక్సర్లు బాదుతూ స్కోరును రాకెట్ వేగంతో తీసుకెళ్లాడు. 32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు లివింగ్ స్టోన్. అటు బౌలింగ్‌లోనూ 2/25తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా లివింగ్‌స్టోన్ నిలిచాడు.