రాష్ట్ర వ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమం ప్రారంభం..

331
Pulse Polio
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం పల్స్‌ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు పల్స్‌ పోలియో కార్యక్రమం కొనసాగనుంది. కాగా హైదరాబాద్‌లో మాత్రం ఫిబ్రవరి 3 వరకు పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 38,31,907 మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నట్లుగా సమాచారం. 23,331 కేంద్రాల ద్వారా పోలియో చుక్కల పంపిణీ కొనసాగుతోంది. పోలియో ఫ్రీ దేశంగా భారత్‌ ప‌దేళ్లు పూర్తి చేసుకుంది.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 2021 మొదటి దశ పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రపతి భవన్‌లో ఐదేళ్లలోపు చిన్నారులకు శ‌నివారం సాయంత్రం పోలియో చుక్కలు వేయడం ద్వారా రాష్ట్రపతి జాతీయ ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌, సహాయ మంత్రి అశ్విని కుమార్‌ చౌబే, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -