ముక్కోటి వృక్షార్చన గొప్ప కార్యక్రమం- పుల్లెల గోపీచంద్

91

ఈ నెల 24న టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం చాలా గొప్పదని.. దీనిలో క్రీడాకారులు అందరూ భాగస్వాములు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తెలపడం జరిగింది. గోపీచంద్ ఈ రోజు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను కలిశారు. ఈ సందర్భంగా గోపీచంద్‌కు ముక్కోటి వృక్షార్చన కార్యక్రమానికి సంబంధించిన వివరాలతో కూడిన పోస్టర్ ను అందజేశారు.