పట్టాభికి మహేష్‌ బర్త్ డే విషెస్..

86
mahesh babu

సూపర్ స్టార్ మహేష్‌ బాబు తన మేకప్ మ్యాన్ పట్టాభికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ప్రతి ఏడాది పట్టాభి బర్త్ డే సందర్భంగా విషెస్ తెలియజేయడం తెలిసిందే. తాజాగా మహేష్‌ బాబు ట్విట్టర్ లో స్పందించారు. “నాకు తెలిసినంతవరకు అత్యుత్తమ మేకప్ మ్యాన్ అంటే పట్టాభి. ఆయన సంతోషకర రీతిలో జన్మదినాన్ని జరుపుకోవాలని ఆశిస్తున్నాను. మున్ముందు కూడా ఆయన తన వృత్తిలో మరింత రాణించాలని కోరుకుంటున్నాను. ఆయనపై ఎప్పటికీ ప్రేమాభిమానాలు నిలిచే ఉంటాయి” అని మహేశ్ బాబు పేర్కొన్నారు.

మహేశ్ బాబుతో పట్టాభి అనుబంధం ఇప్పటిదికాదు. గత 27 ఏళ్లుగా మహేశ్ బాబు పర్సనల్ మేకప్ మ్యాన్‌గా పట్టాభి కొనసాగుతున్నారు. పట్టాభి లేకుండా తాను కెమెరాను ఫేస్ చేయలేను అని మహేష్‌ గతంలో స్వయంగా అన్నారు. మహేష్‌కు పట్టాభి వృత్తి నైపుణ్యంపై ఎంత నమ్మకం ఉందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.