పబ్ జీ ప్రియులకి గుడ్ న్యూస్

383
pub g india

పబ్ జీ లవర్స్‌కి గుడ్ న్యూస్‌.భారత్‌లో తిరిగి పబ్‌ జీ గేమ్‌ని తీసుకొచ్చేందుకు ఆ కంపెనీ శతవిధాలా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌లో పబ్ జి మొబైల్ ఇండియా పేరుతో కొత్త యాప్‌ని తీసుకురానుండగా ఇందుకోసం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది.

ఇప్పటికే దీనికి సంబందించిన టీజర్‌ని విడుదల చేయగా గేమ్‌ని అధికారికంగా ప్రారంభించటానికి ముందు పబ్‌జీ కార్పొరేషన్ తన ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ మొదటి వారంలో గ్రాండ్ గా విడుదల చేయడానికి కంపెనీ సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం.

భారత్‌లో చైనా యాప్‌లను బ్యాన్ చేయడంతో రెండు నెలల క్రితం పబ్ జీ యాప్‌ని బ్యాన్ చేసింది కేంద్రం. దీంతో పబ్ జీ ప్రియుల సుదీర్ఘ నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది.