టీఆర్ఎస్‌తోనే అభివృద్ధి: విజయారెడ్డి

79
trs

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. 150 డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతిస్తున్నారు. ఖైరతాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయారెడ్డి,మైలార్ దేవుపల్లిలో ప్రేమ్ దాస్‌ గౌడ్ విస్తృత ప్రచారం నిర్వహించారు.మైలార్ దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని హరిజనబస్తీ ఓల్డ్ విలేజ్‌లో ప్రేమ్ దాస్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు.

పీజేఆర్ వారసురాలిగా, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న తననే ప్రజలు మరోసారి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు విజయారెడ్డి. ఐదేళ్లు తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉన్నానని, వారి సమస్యలను పరిష్కరించానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల నాడి తెలిసిన నాయకుడని.. వారి కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని ఆమె కొనియాడారు.