పబ్‌జీ సహా మరో 118 చైనా యాప్‌లు బ్యాన్‌

234
pub g
- Advertisement -

సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్ జీ సహా 118 చైనా యాప్‌లపై నిషేధం విధించింది. భారత సైబర్‌ స్పేస్‌ భద్రతే లక్ష్యంగా పలు యాప్‌లు యూజర్ల డేటాను చట్టవిరుద్ధంగా భారత్‌కు వెలుపల ఉన్న సర్వర్లకు చేరవేస్తున్నట్లు తమకు వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు అందినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ‘హానికర యాప్‌’లపై నిషేధం విధించాలని హోంశాఖకు చెందిన సైబర్‌ క్రైమ్‌ సెంటర్‌ సిఫార్సు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, రక్షణ, భద్రతా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని…. భారత్‌లో దాదాపు 3.3 కోట్ల మంది క్రియాశీలక పబ్‌జీ యూజర్లు ఉన్నట్లు కేంద్రం అంచనా వేసింది.

నిషేధానికి గురైన వాటిలో పబ్‌జీతోపాటు పబ్‌జీలైట్‌, బైదు, బైదు ఎక్స్‌ప్రెస్‌ ఎడిషన్‌, టెన్సెంట్‌ వాచ్‌లిస్ట్‌, ఫేస్‌యూ, వియ్‌చాట్‌ రీడింగ్‌, టెన్సెంట్‌ వీయూన్‌ వంటి యాప్‌లు ఉన్నాయి. కేంద్రం ఇప్పటికే టిక్‌టాయ్‌, వియ్‌చాట్‌, యూసీ బ్రౌజర్‌ వంటి చైనా యాప్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

- Advertisement -