పాక్‌లో నవశకం….ప్రధానిగా ఇమ్రాన్‌ ఖాన్‌..!

411
imran khan

పాకిస్ధాన్‌లో నవశకం ప్రారంభం కానుందా…?ఆ దేశ మాజీ క్రికెటర్ ప్రధాని కానున్నారా..?అంటే అవుననే చెబుతున్నాయి ఆ దేశ ఎగ్జిట్ పోల్స్. బుధవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్(పీటీఐ) అధికారంలోకి వస్తుందని తెలిపోయింది.

ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రారంభించిన ఓట్ల లెక్కింపులో ఆ పార్టీ 105 స్ధానాల్లో ఆధిక్యంలో ఉండగా నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్‌-ఎస్ పార్టీ వెనుకబడిపోయింది. మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) 39 సీట్లలో ఆధిక్యంలో ఉంది.

ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ మద్దతిచ్చిన అల్లాహో అక్బర్ తెహ్రీక్ (ఏఏటీ) పార్టీని పాక్ ఓటర్లు గట్టి దెబ్బ కొట్టారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఊసే లేకుండా పోయింది. పార్లమెంటులోని 272 స్థానాలకు 3,459 మంది, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల్లోని 577 స్థానాలకు 8,396 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఇమ్రాన్ ఖాన్‌కు అటు సైన్యం, ఇటు ఉగ్రవాదుల మద్దతు కూడా ఉండటం గమనార్హం.