తోలు తీస్తా…జగన్‌కు పవర్ పంచ్‌

192
jagan pawan

వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు పవర్ స్టార్,జనసేన అధినేత పవన్ కల్యాణ్. దూరం నుంచి చూస్తే తాను మెతకగానే కనిపిస్తానని దగ్గరకొస్తే తోలు తీస్తానని హెచ్చరించారు. సమాజంలో మార్పు తీసుకొస్తాననే భయంతోనే నన్ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారని దుయ్యబట్టారు.

సినిమాల్లో డ్యాన్సులు,డైలాగులు చెప్పానని అనుకుంటున్నారేమో బయటకు రండి నేనేంటో చూపిస్తానని ధ్వజమెత్తారు. నాకు వేల కోట్ల ఆస్తులు లేవని ప్రజాభిమానమే ఉందని…వ్యక్తిగత విమర్శలు చేయాలనుకుంటే మీకంటే బలంగా చేయగలనని జగన్‌కు సూచించారు. ఫ్యాక్షనిస్టులు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఉప్పెనలా పోరాడుతాడని స్పష్టంచేశారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసేందుకే నేనొచ్చానని తెలిపారు.

మరోవైపు పవన్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు జనసేన నాయకులు. జగన్‌పై తీవ్రస్ధాయిలో మండిపడ్డ జనసేన కార్యకర్తలు పవన్‌ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకే జగన్ చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

అంతకముందు పవన్ పై జగన్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ నిత్య పెళ్లికొడుకని….కార్లు మార్చినంత ఈజీగా పెళ్లాలను మారుస్తాడని ఆరోపించారు. అలాంటి వ్యక్తి విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.