చంద్రగ్రహణం…శ్రీవారి ఆలయం మూసివేత

238
blood-moon-supermoon
- Advertisement -

ఈ నెల 27న(రేపు) ఆకాశంలో అద్భుతం జరగనుంది. గత వంద సంవత్సరాలుగా ఎప్పుడూ చూడని సుదీర్ఘ బ్లడ్ మూన్ దర్శనమివ్వనుంది. దాదాపు 43 నిమిషాల పాటు కనువిందు చేయనున్న చంద్ర గ్రహణం భారతదేశంతో పాటు దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియాలో కనిపించనుంది.

చంద్రగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలను మూసివేయనున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ ఈవో శ్రీనివాసరాజు తెలిపారు. శుక్రవారం రాత్రి 11.54 గంటల నుంచి శనివారం తెల్లవారు జామున 3.49 గంటల వరకు గ్రహణ గడియలు ఉంటాయన్నారు.

గ్రహణానంతరం శనివారం వేకుమజామున 4.15 తర్వాత గుడి తలుపులు తెరిచి.. సుప్రభాతం, శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తామని శ్రీనివాసరాజు వెల్లడించారు. శనివారం ఉదయం 7 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు. గ్రహనం సందర్భంగా లేనిపోని అనుమానాలు,అపోహలను నమ్మవద్దని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భవతులు ఎలాంటి భయందోళన చెందాల్సిన పనిలేదన్నారు.

- Advertisement -