సైకో వర్మ…సాంగ్ టీజర్

139
varma

ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తనయుడు నట్టి క్రాంతి హీరోగా నటిస్తున్న చిత్రం సైకో వర్మ. ఈ సినిమాకు నట్టికుమార్ దర్శకత్వం వహిస్తుండగా క్రాంతి సరసన కృష్ణప్రియ, సుపూర్ణ మలకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నట్టీస్ ఎంటర్‌టైన్మెంట్స్, క్విటీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై నట్టి లక్ష్మి సమర్పణలో నిర్మాతలు అనురాగ్ కంచర్ల, నట్టి కరుణ నిర్మిస్తున్నారు.

పిచ్చోడి చేతిలో రాయి.. ఈ సైకో వర్మనే మన భాయి అంటూ సాగే పాటను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట వీడియో సాంగ్‌ను ఈనెల 26న విడుడల చేస్తున్నారు. అయితే, ఆ పాట టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు. 30 సెకెన్ల నిడివి ఉన్న ఈ సాంగ్ టీజర్ మంచి ఫోక్ బీట్‌తో అలరిస్తోంది. ఈ చిత్రానికి ఎస్‌.ఏ.ఖుద్దూస్‌ సంగీతం సమకూరుస్తున్నారు.