సమంతా జిమ్ వర్కౌట్ అదుర్స్!

285
actress samantha

తెలుగు .. తమిళ భాషల్లో సమంతా అగ్రకథానాయికగా వెలుగొందుతోంది. గ్లామర్,నటనతో పాటు ఫిట్ నెస్‌కు సమ ప్రాధాన్యతను ఇవ్వడం వల్ల సామ్‌కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, తనని తాను కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్న సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా ఫిట్ నెస్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇచ్చే సామ్‌…పలువురికి ఛాలెంజ్ కూడా ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తాను వర్కవుట్ చేస్తున్న లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసిన సమంత మరోసారి అందరి అటెన్షన్‌ని తనవైపుకు తిప్పుకుంది.