క్రిష్ దర్శకత్వంలో పవన్‌ @ 27

311
pspk 27
- Advertisement -

వకీల్ సాబ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన 27వ సినిమాను క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ బర్త్ డే సందర్భంగా ప్రీ లుక్‌ని విడుదల చేశారు దర్శకుడు క్రిష్‌.

ఈ సినిమా కోసం పదిహేను రోజుల‌ షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది.. చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది.. ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం.. ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తూ బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలిపారు క్రిష్‌.

పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏ.ఎం.రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపొందిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -