పవన్ 27…అప్ డేట్!

223
pawan
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ హీరోగా క్రిష్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. PSPK 27గా వస్తున్న ఈ పీరియాడికల్ చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్ వచ్చేసింది. మార్చి 11 శివరాత్రి సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ని రివీల్ చేయనున్నారు.

200 ఏళ్ళ కింద‌ట జ‌రిగిన క‌థ‌తో ఈ మూవీ రూపొందుతుంది. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే టైటిల్‌ని చిత్రానికి ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తుంది. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌జ్రాల దొంగ‌గా క‌నిపించ‌నున్నాడ‌ని, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది.

ఇక ప్రస్తుతం పవన్ నటించిన వ‌కీల్ సాబ్ త్వరలో విడుదల కానుండగా క్రిష్‌తో మూవీతో పాటు సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ రీమేక్ వీటి త‌ర్వాత హ‌రీష్‌శంక‌ర్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం, సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు పవన్‌.

- Advertisement -