గ్రీన్‌ సిగ్నల్‌ పడింది..

192
- Advertisement -

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రంలో రెండో ప్రయోగవేదికపై 1,425 కిలోల ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్‌తో సిద్ధంగా ఉన్న రాకెట్‌ ప్రయోగానికి లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు ఆమోదం తెలిపింది. షార్‌లో మంగళవారం జరిగిన మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ సమావేశంలో శాస్త్రవేత్తలు రాకెట్‌ రిహార్సల్స్‌ ఫలితాలను పరిశీలించారు. రాకెట్‌ ప్రయోగానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు.

 PSLV-C39/IRNSS-1H Mission is scheduled to be launched on

అనంతరం షార్‌ డైరెక్టర్‌ కున్హికృష్ణన్‌ అధ్యక్షతన లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు సమావేశమై ప్రయోగానికి సంసిద్ధితను వ్యక్తం చేసింది. దీంతో ఈ ప్రయోగం కోసం బుధవారం మధ్యాహ్నం 1.59 గంటలకు శాస్త్రవేత్తలు కౌంట్‌డౌన్‌ ప్రారంభించనున్నారు. గురువారం రాత్రి 7 గంటలకు పీఎస్‌ఎల్వీ-సీ39 రాకెట్‌ ద్వారా 1,425 కిలోల నావిగేషన్‌ ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్‌ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

స్వదేశీ నావిగేషన్‌ వ్యవస్థ కోసం గతంలో ప్రయోగించిన 7 ఉపగ్రహాల్లో తొలి ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏలో కాలసూచిక వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో దాని స్థానంలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్‌ను ప్రవేశపెడుతున్నారు. కాగా, ప్రయోగాన్ని పర్యవేక్షించేందుకు ఇస్రో చైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ బుధవారం షార్‌కు చేరుకోనున్నారు.

- Advertisement -