లారా దత్తాపై మండిపడ్డ మహేష్ భూపతి !

245
Mahesh Bhupathi angry after wife Lara Dutta uses Wimbledon towel
Mahesh Bhupathi angry after wife Lara Dutta uses Wimbledon towel
- Advertisement -

శనివారం ఉదయం నుంచి ముంబయి నగరాన్ని వరదలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. వచ్చే 24 గంటలు కూడా పరిస్థితి ఇలానే ఉండొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వర్షం కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోందిరోడ్లు జలమయమయ్యాయి. పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరిగాయి. . ప్రతికూల వాతావరణం వల్ల కొన్ని రైల్వే, విమాన సేవలను తాత్కాలికంగా నిలిపి వేశారు. ఆ ప్రభావం ప్రముఖులు, వీఐపీలపైనా పడింది. భారత మాజీ టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి, అతని భార్య లారా దత్తా కూడా వర్ష బాధితులుగా మిగిలారు.

అయితే, వర్షాలు కురుస్తున్న సమయంలో లారా దత్తా చేసిన ఓ పని మహేష్ భూపతికి కోపం తెప్పించింది. ఇంట్లోకి వరద నీరు వస్తుండటంతో మహేష్ భూపతి గతంలో గ్రాండ్ శ్లామ్ పోటీల్లో పాల్గొన్న వేళ వాడిన టవల్స్ ను అడ్డుగా పెట్టి, వాటిని ఫోటో తీసి, తన ట్విట్టర్ ఖాతాలో పెడుతూ, వింబుల్డన్, యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్ టవల్స్ తనకు ఇలా ఉపయోగపడ్డాయంటూ వ్యాఖ్యానించింది. దీనిపై తన అసంతృప్తిని వ్యక్తం చేసిన మహేష్, అవన్నీ తన ఎన్నో సంవత్సరాల శ్రమకు ఫలితమని, తననేమైనా ఆటపట్టిస్తున్నావా అని కాస్తంత గట్టిగానే బదులిచ్చాడు. గ్రాండ్ శ్లామ్ పోటీల్లో తన ఆటకు గుర్తుగా వాటిని మధుర జ్ఞాపకాలుగా మహేష్ చూసుకుంటున్నాడట.

ముంబయిని మంగళవారం ముంచెత్తిన వాన.. బుధవారం ఉదయం కాస్త తగ్గుముఖం పట్టింది. లోకల్ రైలు సర్వీసులు, బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. రోడ్లపై నిలిచిన నీటిని అక్కడి అధికారులు తొలగిస్తున్నారు. ముంబయి నగర వ్యాప్తంగా రాత్రంతా కార్యాలయాల్లోనే గడిపారు ఉద్యోగులు. ఇప్పుడిప్పుడే తమ నివాసాలకు చేరుకునేందుకు ఉద్యోగులు యత్నిస్తున్నారు. ఇవాళ ప్రభుత్వ ఆఫీసులు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి ఎవరూ కూడా బయటకు రావొద్దని సీఎం సూచించారు. ఇక విక్రోలి పరిసరాల్లో వర్షానికి ఓ ఇల్లు నాని కూలిపోయింది. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

- Advertisement -