ప్రధాని పర్యటనపై అగ్రహాజ్వాలలు

267
modi
- Advertisement -

రామగుండం…అగ్నిగుండం..?
అడ్డుకుని తీరుతామని విద్యార్థి జెఎసి హెచ్చరిక గవర్నర్ తమిళ్ సైని రీకాల్ చేయాలి : సి.పి.ఐ
రాజ్ భవనను ముట్టడిస్తాం : సిపిఎం ఎస్సీ వర్గీకరణపై స్పందించాలని ఎంఆర్ పిఎస్ అల్టిమేటం
12న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు

సింగరేణి కార్మిక సంఘాలు, ఎంఆర్ పిఎస్, వామపక్షాలు హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ నెల 12వ తేదీన రామగుండంలో వస్తున్నందున ఆయనకు తీవ్రస్థాయిలో నిరసనలు తెలిపేందుకు కార్మిక, విద్యార్థి, యువజన సంఘాలతో పాటుగా వామపక్ష పార్టీలు సమాయత్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంపట్ల, సింగరేణి కాలరీసను ప్రైవేటీకరిస్తున్నందుకు, ఇతర అనేక సమస్యలకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ఉద్యమించడానికి దాదాపు అన్ని వర్గాలు ఏర్పాట్లు చేసుకొన్నట్లు తెలుస్తోంది. రామగుండంను అగ్నిగుండంగా మార్చేందుకు కార్మికలోకం పథకరచన చేసినట్లుగా తెలుసోతంది. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో జరుగనంతటి తీవ్రస్థాయిలో నిరసన జ్వాలలు ఎలా ఉంటాయో నరేంద్రమోడీకి రుచి చూపించాలని ఈ పక్షాలన్నీ ఏకాభిప్రాయానికి వచ్చాయని పలువురు నాయకులు వివరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నాం కదా… ఏం చేసినా చెల్లుతుంది, అడిగేవాడు లేడనే అహంతో కార్పోరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతూ అన్ని వర్గాల ప్రజలను కార్పోరేట్ కంపెనీలకు కట్టుబానిసలుగా చేసేందుకు వీలుగా అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకొంటున్న నరేంద్రమోడీకి ఉద్యమాల గడ్డగా జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తే ఆ వ్యతిరేతకు సంబంధించిన తీవ్రత ఎలా ఉంటుందో రుచి చూపిస్తామని ఆయా సంఘాల నాయకులు గట్టి పట్టుదలతో ఉన్నారు. కాగా ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని సిపిఐ ప్రకటించింది.

విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న గవర్నర్ ను వెంటనే రీకాల్ చేయాలని డిమాండ్ చేసింది. మోదీ పర్యటన దృష్ట్యా టీఆర్ఎస్, వామపక్షాలు ఉమ్మడి ఉద్యమ కార్యచరణను సిద్ధం చేసుకుంటున్నాయి. వామపక్ష కార్మిక సంఘాలతో టీఆర్ఎస్ కార్మిక సంఘాలు చర్చలు జరుపుతున్నాయి. ప్రధాని మోదీకి తెలంగాణపై అనుకోని ప్రేమ పుట్టుకొచ్చిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు. గతేడాది ప్రారంభమైన ఫ్యాకల్టీని ఇప్పుడు ప్రారంభించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ నెల 10 నుంచి సింగరేణి బొగ్గు గనుల్లో ఆందోళనలు చేపట్టనున్నట్టుగా తెలిపారు. బిజెపి తమకు ప్రధాన శత్రువు అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం గవర్నర్లను ఏజెంట్లుగా మార్చుకుని రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 12న ప్రధాని పర్యటన సందర్భంగా రాజ్ భవనను ముట్టడించనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. టీఆర్ఎస్, సిపిఐలతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని రామగుండం పర్యటన అగ్నిగుండం అవుతుందని… తెలంగాణ విశ్వవిద్యాలయాల విద్యార్థుల జెఎసి అల్టిమేటం ఇచ్చింది.

ప్రధాని మోదీ రామగుండం పర్యటనను అడ్డుకుంటామని విద్యార్థుల జెఎసి ప్రకటించింది. తెలంగాణ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని వారు మండిపడ్డారు. పాతవాటినే మళ్లీ ప్రారంభిస్తూ.. రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. యూనివర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదించాలని, కావాలనే గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ ఈ బిల్లును తొక్కిపెట్టారని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

శాసనసభలో పాస్ చేసిన బిల్లును గవర్నర్ ఆమోదించక పోవడంపై విద్యార్థుల జెఎసి కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతోన్న విషయం తెలిసిందే. ఇతర రాష్ట్రాలకు ఒక విధంగా తెలంగాణకు మరో విధంగా కేంద్రం కుట్రలు చేస్తోందని జెఎసి నాయకులు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అదే విధంగా ఎస్సీ వర్గీకరణపై ప్రధాని స్పందించాలని ఎంఆర్ పిఎస్ డిమాండ్ చేస్తోంది. విద్యార్థి జెఎసి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ దుమారం రేగింది. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. రాష్ట్రవ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసన.. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రావడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షిస్తానని ఈ నెల 10వ తేదీ లోపు ప్రకటించి రాష్ట్రానికి రావాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ కైవి, సిఐటియూ, ఎఐటీయూసి, హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసి కార్మిక సంఘాల నాయకులు సంయుక్తంగా విలేకరుల సమావేశంలోనే ప్రకటించారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాక కార్మిక హక్కులను కాలరాసే విధంగా పాలనాపరమైన విధానాలు అవలంభిస్తున్నారని టిఆర్ఎస్సిని రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ విమర్శించారు. సింగరేణి, విద్యుత్, ఎన్టీపిసి తదితర రంగాలను ప్రైవేటీకరించే చర్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ లను తీసుకురావడం అంటే దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను హరించడమేనని ద్వజమెత్తారు. ప్రధాని మోదీ వెంటనే కార్మిక వ్యతిరేక విధానాలను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 12న హైదరాబాద్ ఆర్టీసీ క్రాసోడ్స్ లో అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నల్ల జెండాలతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు తెలియజేశారు.

జిల్లాల నాయకులు వారి వారి స్థానిక వెసులుబాటుకు అనుగుణంగా నిరసన కార్యక్రమాలు ఉంటాయన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని సిఐటియూ కార్యదర్శి భూపాల్ అన్నారు. సింగరేణిలో 15 కొత్త బావులను తవ్వకానికి అనుమతి ఇవ్వాలని కోరితే కేంద్రం నిరాకరించినట్టు వివరించారు. ఆస్ట్రేలియాలో బొగ్గు బావులు కలిగిన ఆదానీ కంపెనీ నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవాలని మోడీ భావిస్తున్నట్టు చెప్పారు. ఎఐటీయూసి రాష్ట్ర అధ్యక్షులు బాలరాజు మాట్లాడుతూ విభజన చట్టాల హామీల అమలును నిర్లక్ష్యం చేసిన మోడీకి తెలుగు రాష్ట్రాలలో అడుగు పెట్టే హక్కు లేదన్నారు. హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెబ్బ రామారావు మాట్లాడుతూ అన్ని కార్మిక సంఘాలు ముక్త కంఠంతో ప్రధాని గో బ్యాక్ నినాదంతో కలిసికట్టుగా నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఈ నిరసనలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటారన్నారు. ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు విజయ్ భాస్కర్ మాట్లాడుతూ 2015లో ఉత్పతి ప్రారంభమైన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ (ఆర్ఎఫ్ సిఎల్) ని 2022లో జాతికి అంకితం చేయడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ వికాస సమితి సైతం ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను వ్యతిరేకిస్తున్నారు.

ఆర్ఎఫ్ సిఎల్ ప్రారంభమై విపరీతమైన దుర్వాసనను వెదజల్లుతోందని, రామగుండం ప్రాంత భూ నిర్వాసుతులకు ఇప్పటికీ న్యాయం చెయ్యకుండా.. పరిశ్రమను ప్రైవేటుకు ఇచ్చి చేతులు దులుపుకున్న ప్రధాని నరేంద్ర మోడీ రామగుండం పర్యటనను పారిశ్రామిక ప్రాంత ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని తెలంగాణ వికాస సమితి తెలిపింది. బొగ్గు బ్లాకులను ప్రైవేటకు కట్టబెట్టి సింగరేణిని చంపాలని చూస్తున్న ప్రధాని పర్యటనను ఈ ప్రాంతవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తారు.. మోడీ అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక ధోరణిని.. తెలంగాణ వికాస సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కృష్ణా జలాల పంపిణీని ఇప్పటికీ తేల్చకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న మోదీ.. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వని మోడీ.. మా రైతుల వడ్లు కొనమంటే నూకలు తినండి అని అవమానించిన మోడీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’ వారు మండిపడ్డారు.

చేపడుతోన్న విషయం తెలిసిందే. ఇతర రాష్ట్రాలకు ఒక విధంగా తెలంగాణకు మరో విధంగా కేంద్రం కుట్రలు చేస్తోందని జెఎసి నాయకులు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అదే విధంగా ఎస్సీ వర్గీకరణపై ప్రధాని స్పందించాలని ఎంఆర్ పిఎస్ డిమాండ్ చేస్తోంది. విద్యార్థి జెఎసి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ దుమారం రేగింది. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. రాష్ట్రవ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసన.. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రావడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షిస్తానని ఈ నెల 10వ తేదీ లోపు ప్రకటించి రాష్ట్రానికి రావాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ కైవి, సిఐటియూ, ఎఐటీయూసి, హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసి కార్మిక సంఘాల నాయకులు సంయుక్తంగా విలేకరుల సమావేశంలోనే ప్రకటించారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాక కార్మిక హక్కులను కాలరాసే విధంగా పాలనాపరమైన విధానాలు అవలంభిస్తున్నారని టిఆర్ఎస్సిని రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ విమర్శించారు. సింగరేణి, విద్యుత్, ఎన్టీపిసి తదితర రంగాలను ప్రైవేటీకరించే చర్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ లను తీసుకురావడం అంటే దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను హరించడమేనని ద్వజమెత్తారు. ప్రధాని మోదీ వెంటనే కార్మిక వ్యతిరేక విధానాలను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 12న హైదరాబాద్ ఆర్టీసీ క్రాసోడ్స్ లో అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నల్ల జెండాలతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు తెలియజేశారు.

జిల్లాల నాయకులు వారి వారి స్థానిక వెసులుబాటుకు అనుగుణంగా నిరసన కార్యక్రమాలు ఉంటాయన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని సిఐటియూ కార్యదర్శి భూపాల్ అన్నారు. సింగరేణిలో 15 కొత్త బావులను తవ్వకానికి అనుమతి ఇవ్వాలని కోరితే కేంద్రం నిరాకరించినట్టు వివరించారు. ఆస్ట్రేలియాలో బొగ్గు బావులు కలిగిన ఆదానీ కంపెనీ నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవాలని మోడీ భావిస్తున్నట్టు చెప్పారు. ఎఐటీయూసి రాష్ట్ర అధ్యక్షులు బాలరాజు మాట్లాడుతూ విభజన చట్టాల హామీల అమలును నిర్లక్ష్యం చేసిన మోడీకి తెలుగు రాష్ట్రాలలో అడుగు పెట్టే హక్కు లేదన్నారు. హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెబ్బ రామారావు మాట్లాడుతూ అన్ని కార్మిక సంఘాలు ముక్త కంఠంతో ప్రధాని గో బ్యాక్ నినాదంతో కలిసికట్టుగా నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు.

ఈ నిరసనలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటారన్నారు. ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు విజయ్ భాస్కర్ మాట్లాడుతూ 2015లో ఉత్పతి ప్రారంభమైన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ (ఆర్ఎఫ్ సిఎల్) ని 2022లో జాతికి అంకితం చేయడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ వికాస సమితి సైతం ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను వ్యతిరేకిస్తున్నారు. ఆర్ఎఫ్ సిఎల్ ప్రారంభమై విపరీతమైన దుర్వాసనను వెదజల్లుతోందని, రామగుండం ప్రాంత భూ నిర్వాసుతులకు ఇప్పటికీ న్యాయం చెయ్యకుండా.. పరిశ్రమను ప్రైవేటుకు ఇచ్చి చేతులు దులుపుకున్న ప్రధాని నరేంద్ర మోడీ రామగుండం పర్యటనను పారిశ్రామిక ప్రాంత ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని తెలంగాణ వికాస సమితి తెలిపింది. బొగ్గు బ్లాకులను ప్రైవేటకు కట్టబెట్టి సింగరేణిని చంపాలని చూస్తున్న ప్రధాని పర్యటనను ఈ ప్రాంతవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తారు.. మోడీ అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక ధోరణిని.. తెలంగాణ వికాస సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కృష్ణా జలాల పంపిణీని ఇప్పటికీ తేల్చకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న మోదీ.. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వని మోడీ.. మా రైతుల వడ్లు కొనమంటే నూకలు తినండి అని అవమానించిన మోడీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’ వారు మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి..

తెలంగాణ ద్రోహి బీజేపీ

బీఆర్ఎస్‌పై బహిరంగ ప్రకటన..

బిజెపిలో మూడు ముక్కలాట

- Advertisement -