కుంభ్‌ సందేశ్ రథయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత..

26
mlc kavitha

గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ నిర్వహిస్తున్న కుంభ్‌ సందేశ్‌ రథయాత్రను ప్రారంభించారు ఎమ్మెల్సీ కవిత, వినోద్ కుమార్. శుక్రవారం జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మాట్లాడిన కవిత..సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్‌ తరాలకు అందించాలన్నారు.

కరోనా మహమ్మారి వంటి క్లిష్టమైన సమయంలోనూ ప్రపంచమంతా, భారత సంప్రదాయాలు పాటించిందని గుర్తు చేశారు. సంస్కృతిని కొత్త తరానికి చేరవేయడంతో పాటు, ప్రపంచవ్యాప్తం చేసేందుకు కుంభ్‌ సందేశ్ యాత్రను చేపట్టిన వసంత్‌ను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త సత్యవతి తదితరులు పాల్గొనగా రథయాత్ర కుంభమేళా విశిష్టతను తెలియజేస్తూ కన్యాకుమారి నుంచి హరిద్వార్‌ వరకు సాగనుంది.