సంతానోత్పత్తి పెరగాలంటే..!

66
- Advertisement -

ప్రతి మహిళకు తల్లి కావాలనే కోరిక కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నవమాసలు మోసి కడుపులో బిడ్డను పెంచి ఆ బిడ్డకు జనమనిచ్చిన తరువాత మహిళలకు కలిగే అనుభూతి వర్ణనాతీతం. అందుకే ప్రతి మహిళా పిల్లకు కావాలని కలలుకంటుంది. కానీ చాలమంది మహిళలు ఎన్నో కారణాల వల్ల సంతాన భాగ్యానికి నోచుకోవడం లేదు. ఆరోగ్య పరంగా మహిళలు ఎదుర్కొనే ఎన్నో సమస్యలు వారిలో సంతానోత్పత్తి పై తీవ్ర ప్రభావం చూపి చివరకు వారిని అమ్మతనానికి దూరం చేస్తాయి. కాబట్టి మహిళల్లో సంతానోత్పత్తి ఫదిలంగా ఉండడం చాలా ముఖ్యం. మహిళల్లో సంతానోత్పత్తి పెరాలంటే ఏం చేయాలి అనే దానిపై చాలమందికి కనీసపు అవగాహన ఉండదు. అయితే సంతానోత్పత్తి పెరగడానికి ఏవేవో చేయాల్సిన అవసరం లేదని సరైన ఆహారం తీసుకుంటే చాలని నిపుణులు చెబుతున్నారు. మరి మహిళల్లో సంతానోత్పత్తిని పెంచే పదార్థాలు ఏవో చూద్దాం !

దానిమ్మ
దానిమ్మ పండు మహిళలకు ఎంతో ప్రయోజనకారి అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ ఏ, సి, ఇ, బి3 వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇంకా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి. ఇవన్నీ మహిళల్లో సంతానోత్పత్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందుకే బలహీనంగా ఉన్న మహిళలు ప్రతిరోజు దానిమ్మపండు తినడం ఎంతో మేలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:Revanth:రేవంత్ ‘రౌడీ రాజకీయం’?

అంజీర్
అంజీర్ కూడా మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది. ఇంకా ఇందులో ఉండే కాల్షియం మహిళల్లో ఎముకల పటుత్వాని పెంచుతుంది. అంతే కాకుండా ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్, మరియు ఇతరత్రా పోషకాలు మహిళల్లో సంతానోత్పత్తిని పెంచుతాయని పలు పరిశోదనల్లో వెల్లడైంది.

బీన్స్
ఇవి కూడా స్త్రీ లలో సంతానోత్పత్తిని పెంచడంలో సహాయ పడతాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్ వంటివి మెండుగా ఉంటాయి. ఇవి మహిళల్లో శక్తిని పెంచి వారికి ఉండే ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి.

పెరుగు
అండాశయ పోలికల్స్ ను ఆరోగ్యంగా ఉంచడంలో పెరుగు ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకే ప్రతిరోజూ మహిళలు పెరుగు తప్పనిసరిగా తినాలని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఇవే కాకుండా ఫైనాఫిల్, జీడిపప్పు, ఫ్యాటిఫిష్, ఆస్పరగస్ వంటివి కూడా ఆహార డైట్ లో చేర్చుకుంటే మహిళల్లో సంతానోత్పత్తి పెరిగే అవకాశం ఉంది.

- Advertisement -