- Advertisement -
కోనోకార్పస్ చెట్లను నరకవద్దని కోరారు ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త, యోగి వేమన విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఏఆర్ రెడ్డి. కోనోకార్పస్ చెట్లను నరికి వేయాలని గతంలో అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు స్పీకర్ గడ్డం ప్రసాద్.
ఈ నేపథ్యంలో ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఏఆర్ రెడ్డి… ఈ చెట్లు మిగతా మొక్కలన్నిటి కంటే అత్యధిక కార్బన్ డై ఆక్సైడ్‌ను తీసుకొని.. అత్యధిక ఆక్సిజన్‌ను అందిస్తున్నట్లు పరిశోధనలో తేలింది అన్నారు.
Also Read:HCU భూముల వివాదం…సుప్రీం సీరియస్
ఈ చెట్ల ఆకులు తింటే ఒంట్లో చక్కెర శాతం, గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గుతుందని పరిశోధనల్లో తేలిందని చెప్పారు. ప్రభుత్వం కోనోకార్పస్ చెట్లను నరికితే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాం అని స్పష్టం చేశారు.
- Advertisement -

