సాయి పల్లవి వల్ల అప్పులపాలు

59
- Advertisement -

హోమ్లీ బ్యూటీ సాయి పల్లవికి మంచి ఫ్యామిలీ హీరోయిన్ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ కి తగ్గట్టుగానే సాయి పల్లవి కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ముఖ్యంగా రెగ్యులర్ హీరోయిన్లకు సాయి పల్లవి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. సహజంగా హీరోయిన్లు నిత్యం హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో అందాల దాడి చేస్తూ ఉంటారు. కానీ, సాయి పల్లవి మాత్రం కుటుంబ బంధాలను బలంగా చాటే విధంగా పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. ఎన్నడూ ఎక్స్ పోజింగ్ కూడా చేయదు. మరి ఇలాంటి సాయి పల్లవి ‘గార్గి’ మూవీ తర్వాత మరో సినిమాను ఒప్పుకోలేదు.

మంచి నటి. పైగా ఫుల్ డిమాండ్ ఉంది. ఆమె నటనకు ఫ్యాన్స్ కూడా ఇప్పటికే ఫిదా అయ్యారు. ఇంకా అవుతూనే ఉన్నారు. మరెందుకు సాయి పల్లవి సినిమాలు చేయడం లేదు ?. అసలు ఈ న్యాచురల్ బ్యూటీకి ఏం అయింది ? లాంటి కామెంట్స్ తో నెటిజన్లు తరుచూ ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఇలాంటి వారందరికీ సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ సమాధానం చెప్పింది. ఇంతకీ, సాయి పల్లవి ఏం కామెంట్స్ చేసిందో ఆమె మాటల్లోనే విందాం.

Also Read:వీడియో దుమ్మురేపుతోంది.. కానీ

సాయి పల్లవి మాట్లాడుతూ.. ”సినిమా అనేది నిర్మాతలను కాపాడాలి. కానీ, నావల్ల కొందరు నిర్మాతలు అప్పులపాలవుతున్నారు. అయినప్పటికీ, వారు మళ్ళీ నాతో సినిమా చేయాలని కోరుకుంటున్నారు. అయితే వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనుకోవడం లేదు. అలాగే రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ పాత్రలు కూడా నేను చేయలేను. అందుకే, నాకు సినిమాలు తగ్గాయి. నాకు సూట్ అయ్యే రోల్స్ మాత్రమే నేను చేస్తాను’ అని సాయి పల్లవి చెప్పుకొచ్చింది.

Also Read:Mahesh:గుంటూరు కారం..ఫ్యాన్స్‌కి నిరాశే

- Advertisement -