ఓటీటీలతో కొత్త చిక్కులు!

298
ott flatforms
- Advertisement -

కరోనా వైరస్ నేపథ్యంలో ఇటీవలె సినిమాషూటింగ్‌లకు అనుమతి లభించగా థియేటర్ల ఓపెనింగ్‌పై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇక థియేటర్లకు ప్రత్యామ్నాయంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌పై సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొంతమంది నిర్మాతలు ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ఓటీటీ ఫ్లామ్‌నే ఆశ్రయిస్తుండగా మరికొంతమంది నిర్మాతలు మాత్రం థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.

అయితే ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. కరోనా లాక్‌డౌన్‌తో తమ సినిమాలను విడుదల చేసేందుకు కొంతమంది నిర్మాతలు ఓటీటీ నిర్వాహకులతో ఒప్పందం చేసుకున్నారు. ఓటీటీ సంస్థలు అడ్వాన్స్‌ కూడా చెల్లించాయి.అయితే అగ్రిమెంట్ టైం కూడా పూర్తికావడంతో ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లపై సినిమాలు విడుదల చేయాల్సిన పరిస్ధితి నెలకొంది.

దీంతో ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డారు నిర్మాతలు. సినిమాల బడ్జెట్ తగ్గించడంతో పాటు హీరోల పారితోషికాల్లో 25 శాతం నుండి 50 శాతం వరకు కోత విధించే ఆలోచనలో వున్నారట నిర్మాతలు. ఈ మేరకు సమాచారాన్ని కూడా సదరు హీరోలకు ఇచ్చారని టీటౌన్‌లో టాక్ నడుస్తోంది.

ప్రస్తుతం నిర్మాణదశ చివరిలో ఉన్న సినిమాలకు మాత్రమే ఇవి వర్తింపజేయాలని ఆలోచనలో ఉన్న నిర్మాతలు…కరోనా నుండి కొలుకోని సాధారణ పరిస్ధితివచ్చే వరకు కొత్త సినిమాల జోలికిపోకూడదని నిర్ణయించారట. మొత్తంగా ఓటీటీ ఫ్లామ్ ఫామ్‌లతో హీరోలకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి.

- Advertisement -