వెబ్ సిరీస్‌లో నిత్యామీన‌న్

222
nithya menon
- Advertisement -

తెలుగు, తమిళ్‌తో పాటు మలయాళం, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ నిత్యామీనన్‌. కొద్దికాలంగా సినిమాలు తగ్గించిన నిత్యా…వైవిధ్యమైన పాత్రలు దొరికితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

తాజాగా తన రూట్ మార్చి వెబ్ సిరీస్‌లోకి ఎంటరైంది.బిగ్ బి అభిషేక్ బ‌చ్చ‌న్‌తో క‌లిసి బ్రీత్… ఇన్ టు ది షాడోస్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది నిత్యా. అమెజాన్ ప్రైమ్‌లో ఇది ప్రసారమవుతుండగా అమిత్ సాద్‌, స‌యామీఖేర్ కూడా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

ఈ సందర్భంగా ఆనందాన్ని వ్యక్తం చేసింది నిత్యా. వెబ్ సిరీస్ ద్వారా అందరినీ పలకరించడం సంతోషంగా ఉందని తెలిపింది.

- Advertisement -