- Advertisement -
నిర్మాత సురేశ్ బాబును బురిడీ కొట్టించాడు ఓ కేటుగాడు. తన దగ్గర కరోనా వ్యాక్సిన్‌లు ఉన్నాయని సురేశ్ బాబుకు ఆఫీస్‌కు ఫోన్ చేశాడు ఓ కేటుగాడు. అతడి మాటలను నమ్మిన సురేశ్ బాబు ..లక్ష రూపాయలు ఆ వ్యక్తి అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశాడు.
డబ్బులు ట్రాన్సఫర్ చేశాక కేటుగాడికి ఫోన్ చేయడంతో అతని ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో అతనిపై అందరికి అనుమానం రావడంతో జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పలువురు నిర్మాతలు తమ దగ్గర పని చేసే వారికి వ్యాక్సిన్స్ ఇప్పిస్తున్నారు. రీసెంట్‌గా దిల్ రాజు 200 మందికి వ్యాక్సినేషన్ చేయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సురేశ్ బాబు సైతం వ్యాక్సిన్ కోసం ఆర్డర్ ఇవ్వగా మోసపోయారు.
- Advertisement -