ఆనందయ్య కంటి మందు హానికరమే..!

42
eye drops

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇక ఆనందయ్య మందు కంటిలో వేసే డ్రాప్స్‌కు తప్ప మిగిలినవాటికి ఇప్పటికే ఆమోదం తెలిపింది ఏపీ ప్రభుత్వం. అయితే, ఐ డ్రాప్స్‌‌లో మాత్రం కంటికి హాని కలిగించే హానికర పదార్థాలు ఉన్నట్లుగా పరీక్షల్లో తేలింది.

ఆనందయ్య కంటి మందు కళ్లకు హాని కలుగుతుందంటూ నివేదికలు వచ్చాయని హైకోర్టు… ఏపీ ప్రభుత్వానికి తెలుపుతూ …పరీక్షల నివేదికలను తమ ముందుంచాలని ఆదేశించింది. కంటిమందుపై తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేసింది హైకోర్టు. ఏపీ ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్‌ వాదనలు వినిపించగా ఆనందయ్య తరపున న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ తన వాదనలు వినిపించారు.

ఆనందయ్య కరోనా చికిత్సకు నాలుగు రకాల మందులు, ఐ డ్రాప్స్‌ తయారు చేయగా.. ఐ డ్రాప్స్‌ మినహా మిగిలిన నాలుగు రకాల మందులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కంటి మందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు.