శివ కందుకూరి హీరోగా `చూసీ చూడంగానే`

443
Chusi Chudangane
- Advertisement -

`పెళ్ళిచూపులు`, `మెంట‌ల్ మ‌దిలో` వంటి చిత్రాల‌ను నిర్మించి స‌క్సెస్‌ఫుల్ నిర్మాత‌గా పేరు తెచ్చుకోవ‌డ‌మే కాదు..జాతీయ అవార్డ్‌, ఫిలింఫేర్ అవార్డుల‌ను సైతం చేసుకున్నారు నిర్మాత రాజ్ కందుకూరి. ఇప్పుడు రాజ్ కందుకూరి నిర్మాత‌గా, ఆయ‌న త‌న‌యుడు శివ కందుకూరి హీరోగా న‌టిస్తోన్న తొలి చిత్రానికి `చూసీ చూడంగానే` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ చిత్రం ద్వారా శేష సింధు రావు అనే మ‌హిళా ద‌ర్శ‌కురాలిని ప‌రిచ‌యం చేస్తున్నారు రాజ్ కందుకూరి. ఈమె క్రిష్ జాగర్ల‌మూడి, సుకుమార్‌ల వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేశారు.

ఈ చిత్రం షూటింగ్ పూర్త‌య్యింది. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి చిత్రాన్ని సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. రాజ్ కందుకూరి గ‌త చిత్రాల్లాగానే ఈ చిత్రం కూడా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ అసోసియేష‌న్‌లో విడుద‌ల‌వుతుంది. రొమాంటిక్ కామెడీ జోన‌ర్‌లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో వ‌ర్ష బొల్ల‌మ్మ హీరోయిన్‌గా న‌టిస్తుంది. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన `96` చిత్రంలో వ‌ర్ష హీరోయిన్‌గా న‌టించింది. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి `మెంట‌ల్ మ‌దిలో` కెమెరా మెన్ వేద రామ‌న్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు శివ కందుకూరి మ‌రో మూడు చిత్రాల్లో హీరోగా న‌టిస్తున్నారు.

- Advertisement -