ఎన్టీఆర్ , నాని , నాగార్జున టాప్ ప్లేస్ లో ఎవరున్నారో తెలుసా?

305
bigboss
- Advertisement -

బుల్లి తెరపై ప్రాసారమయ్యే బిగ్ బాస్ షో తెలుగులో విజయవంతంగా మూడవ సీజన్ ప్రసారమవుతుంది. ఈషోకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. బిగ్ బాస్ 1, 2సీజన్ ల కన్నా సీజన్ 3కి ఎక్కువగా రేటింగ్స్ , టీఆర్పి వస్తున్నాయట. నాగార్జున యాంకరింగ్ తో ఈషోను మరో లెవల్ కు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే రెండోవారంలో ఎంటర్ అయిన బిగ్ బాస్ రేటింగ్స్ దంచికొడుతోంది. రెండో సీజన్‌తో పోలిస్తే.. కంటెస్టెంట్‌తో పాటు నాగార్జున హోస్ట్ కూడా ఆకట్టుకునేలా ఉండటంతో అందరూ ఊహించినట్టుగానే బిగ్ బాస్ టాప్ రేటింగ్‌లోకి దూసుకొచ్చింది.

ఇప్పటి వరకు ఉన్న అన్నీ షోస్ లలో కంటే బిగ్ బాస్ టాప్ రేటింగ్ లో ఉంది. గత రెండు సీజన్లకంటే కూడా నాగార్జున హోస్ట్ చేసిన ఈ కార్యక్రమానికి టాప్ రేటింగ్ రావడం విశేషం. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 1 షో ఓపెనింగ్ రోజు 16.18 రేటింగ్ రాగా.. నాని హోస్ట్ చేసిన రెండో సీజన్ తొలిరోజు రోజు 15.05 రేటింగ్‌తో వెనుకబడింది. ఇక మూడో సీజన్‌లో నాగార్జున రేటింగ్స్‌ని దంచి కొట్టారు. తొలిరోజు 17.9 రేటింగ్‌తో ఎన్టీఆర్, నానిల రికార్డును బ్రేక్ చేశాడు.

- Advertisement -