సామ్ తల్లి కావాలనుకుంది…కానీ!

44
sam

నాగచైతన్య – సమంత విడాకుల అనౌన్స్‌మెంట్ వచ్చిన దగ్గరి నుండి సమంతపై ట్రోల్స్ ఆగడం లేదు. సామ్‌ను తప్పుబడుతూ నెటిజన్లు ప్రశ్నలవర్షం కురిపిస్తుండగా విమర్శిస్తున్న వారికి ఘాటుగా కాకుండా వినయంతో సమాధానం చెబుతోంది.

అయితే ఈ విషయంలో సమంతకు పలువురు స్టార్లు మద్దతిస్తుండగా తాజాగా శాకుంతలం నిర్మాత నీలిమ గుణశేఖర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శాకుంత‌లం సినిమా కోసం సమంత‌ని సంప్ర‌దించ‌గా, ఆమె అప్ప‌టికే సినిమాలు చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నాని చెప్పిందని తెలిపింది నీలిమ. ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నామ‌ని కొన్ని రోజులు సినిమాల‌కు దూరంగా ఉంటాన‌ని స‌మంత చెప్పిందని అయితే శాకుంతం క‌థ న‌చ్చ‌డంతో కొన్ని కండీష‌న్స్‌తో చేస్తానని సామ్ చెప్పిందని వెల్లడించింది.

జూలై, ఆగస్ట్‌లోకెల్లా షూటింగ్ పూర్తిచేయాలని సామ్‌ కోరడంతో.. మేము ఓకే చెప్పి అలానే ప్లాన్‌ చేసుకున్నాం. స‌మంత శాకుంత‌లం త‌ర్వాత సినిమాలు చేయ‌న‌ని, పిల్ల‌ల్ని క‌నేందుకు ప్లాన్ చేస్తున్నామ‌ని చెప్పింది. కానీ చైతూతో ఇలా విడిపోవ‌డం షాకింగ్‌గా ఉంద‌ని వెల్లడించింది.